‘ధురంధర్ 2’ (Dhurandhar 2) అభిమానులకు గుడ్‌న్యూస్. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తెలుగు వెర్షన్ నేటి (మార్చి 21) నుంచి థియేటర్లలోకి రానుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఇప్పటికే ఆన్‌లైన్‌లో తెలుగు బుకింగ్స్ (Telugu bookings) ప్రారంభమయ్యాయి. అసలు ప్రణాళిక ప్రకారం ఈ సినిమా మార్చి 18న ప్రీమియర్స్ రోజునే అన్ని భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలు మరియు సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల కారణంగా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్లు వాయిదా పడ్డాయి.
ఇప్పుడు పరిస్థితి సర్దుబాటు కావడంతో తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు సెన్సార్ పూర్తి కాగా, కన్నడ వెర్షన్ మాత్రం ఇంకా క్లియర్ కాలేదు. దీంతో మిగతా భాషల్లో సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆదిత్యధర్ (Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే హిందీ వెర్షన్‌తోనే మొదటి రోజు రూ.172 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇప్పుడు దక్షిణాది భాషల్లో విడుదలతో మరింత భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.









గరికపాటిపై ‘గరం గరం’.. ప్రవచనకర్త నోటి వెంట వివాదాలు