ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Nara Chandrababu Naidu) సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో బీజం పడి, అన్ని అనుమతులు పొందిన ప్రాజెక్టులను ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటర్ (Adani Data Center), వెలుగొండ ప్రాజెక్ట్ (Veligonda Project), గ్రీన్‌కో ప్రాజెక్టు (Greenko Project) వంటి వాటిని తనవిగా ప్రచారం చేసుకున్న తాజాగా తిరుమలలోనూ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నాడని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా తిరుమలలో ప్రారంభించిన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ల్యాబ్ విషయంలో ‘క్రెడిట్ చోరీ’ (Credit Theft) జరుగుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ హయాంలోనే పునాది
శ్రీవారి లడ్డూ ప్రసాదం (Srivari Laddu Prasadam), అన్నప్రసాదాల (Free Meal Offering) నాణ్యతపై గత వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) ప్రత్యేక దృష్టి సారించిందని వైసీపీ నేతలు ఆధారాలు బయటపెడుతున్నారు. ఇందులో భాగంగానే 2023 ఆగస్టులో FSSAI సీఈఓ కమలవర్థన్ రావు (Kamal Vardhan Rao) తిరుమలను సందర్శించి, అప్పటి టీటీడీ(TTD) అధికారులతో చర్చలు జరిపారు. తిరుమలలోనే అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉండాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారని, సుమారు రూ. 20 కోట్లతో ఈ ల్యాబ్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని నాడు FSSAIతో కుదిరిన ఒప్పందాన్ని బయటపెడుతున్నారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, నిధుల కేటాయింపు ప్రక్రియ అంతా వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తుచేస్తున్నారు.

బాబు ‘బిల్డప్’ పై సెటైర్లు
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వచ్చిన చంద్రబాబు, అప్పటికే సిద్ధమైన ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. అయితే, ప్రసాదం నాణ్యతపై తానే ఏదో కొత్తగా విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. “జగన్ కష్టపడి ల్యాబ్ తెస్తే.. బాబు గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి నాదే క్రెడిట్ అంటున్నారు” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
భక్తుల ఆవేదన
తిరుమల ప్రసాదం వంటి సున్నితమైన అంశాల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేయడం తగదని శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నెయ్యి కల్తీ అంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే ప్రసాదం నాణ్యత కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను తన సొంత ఆవిష్కరణగా చెప్పుకోవడం గమనార్హం.








