గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు

గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆడంబరాలకు దూరంగా, గిరిజన పల్లెల్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ‘మాటా-మంతి’ నిర్వహించి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

రహదారుల నిర్మాణం నా బాధ్యత
నందిగరువులో గిరిజనులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. “మీరెవరూ నన్ను కలిసి రోడ్లు వేయాలని అడగలేదు. కానీ, ఈ ప్రాంతంలో సరైన రహదారి సౌకర్యం లేక గర్భిణులు, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ‘అడవితల్లి బాట’ కార్యక్రమం ద్వారా రహదారుల నిర్మాణానికి ఉపక్రమించా” అని ఆయన వెల్లడించారు.

గిరిజనులతో మమేకం
ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ కేవలం రాజకీయ నాయకుడిలా కాకుండా, గిరిజనుల్లో ఒకరిగా మమేకమయ్యారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నందిగరువు వరకు నిర్మించిన నూతన రహదారిని పరిశీలించారు. గిరిజనులతో కలిసి పంక్తి భోజనం చేసి, వారి సంస్కృతి, ఆచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment