అల్లు అర్జున్ కొడుకు యాక్షన్ ట్రైనింగ్.. సోషల్ మీడియాలో చర్చ

అల్లు అర్జున్ కొడుకు యాక్షన్ ట్రైనింగ్.. సోషల్ మీడియాలో చర్చ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూడా భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అయాన్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోను అతని తల్లి అల్లు స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్న అయాన్‌ను చూసిన అభిమానులు, తండ్రి అడుగుజాడల్లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతూ ట్రెండింగ్‌గా మారింది.

అల్లు అర్జున్‌కు ఇద్దరు సంతానం ఉన్నారు. అందులో కొడుకు అయాన్ పెద్దవాడు కాగా, కూతురు అర్హ చిన్నది. అర్హ ఇప్పటికే శాకుంతులం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే అయాన్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. “అయాన్ మోడల్” అనే ట్యాగ్‌తో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాడు. ఇక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వీడియో బయటకు రావడంతో, భవిష్యత్తులో తండ్రిలాగే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment