“ఈమె నా మిసెస్”.. మైదానంలో హార్దిక్ పాండ్యా–మాహికా శర్మ రొమాన్స్ వైరల్

“ఈమె నా మిసెస్”.. మైదానంలో హార్దిక్ పాండ్యా–మాహికా శర్మ రొమాన్స్ వైరల్

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్‌లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్తుతం హ్యాపీ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ విజయోత్సవాల సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య, మైదానంలో చోటుచేసుకున్న రొమాంటిక్ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీమిండియా వరుసగా రెండోసారి T20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న నేపథ్యంలో జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా, నటి మ‌హికా శ‌ర్మతో కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

“మాహికా నా మిసెస్”
విజయం అనంతరం స్పోర్ట్స్ యాంకర్ జతిన్ సప్రుతో జరిగిన ఇంటర్వ్యూలో హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాహికా గురించి మాట్లాడుతూ, “ఆమె నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ విజయాలే వస్తున్నాయి. ఆమె నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అన్నీ మంచి జరుగుతున్నాయి” అని చెప్పారు. అంతేకాకుండా మైదానంలో ఉన్న మాహికా వైపు చూపిస్తూ “ఈమె నా మిసెస్” అని పరిచయం చేయడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. గతంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, హార్దిక్ ఇలా బహిరంగంగా “మిసెస్” అని పిలవడం వారి సంబంధంపై చర్చకు దారితీసింది.

మైదానంలో రొమాంటిక్ క్షణాలు
ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా మైదానానికి తిరిగి రాగానే మాహికా శర్మ అతనిని హత్తుకుని అభినందించింది. అంతేకాకుండా అతని బుగ్గపై ముద్దు పెట్టుకోవడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

ఈ రొమాంటిక్ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. క్రికెట్ విజయోత్సవాల మధ్య హార్దిక్–మాహికా జంట కనిపించిన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇక అద్భుత ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా రాబోయే అంతర్జాతీయ టోర్నీల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడా అన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment