వైఎస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం (Video)

వైఎస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister of Andhra Pradesh), వైసీపీ అధినేత (YSRCP Chief) వైఎస్ జ‌గ‌న్‌ (Y. S. Jagan Mohan Reddy)ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister of Telangana) మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Mallu Bhatti Vikramarka) మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క , జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి (Wedding) సంబంధించిన ఆహ్వాన పత్రికను (Invitation Card) వైఎస్ జగన్‌కు అందజేశారు. వివాహ వేడుకకు స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు.

వైఎస్ జగన్ ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలియజేశారు. వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండిన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. కుటుంబ కార్యక్రమానికి ఆహ్వానం అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భ‌ట్టి విక్ర‌మార్క వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment