టాలీవుడ్లో ప్రస్తుతం భారీ నిడివి గల సినిమాల ట్రెండ్ సక్సెస్‌గా కొనసాగుతోంది. కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటలకు పైగా రన్ టైమ్ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ‘పుష్ప 2’ నిరూపించేసింది. ఈ ట్రెండ్‌లో భాగంగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) రూపొందిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కూడా మూడు గంటల పైగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రఫ్ కట్ (Rough Cut) నాలుగు గంటలకు పైగా ఉందని, ఎడిటింగ్ తరువాత కూడా మూడు గంటల పైగా ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
అయితే, సినిమా పిఆర్ (PR) వర్గాలు ఈ వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం వస్తున్న నిడివి ఊహాగానాలేనని, అభిమానులు ఇవి నిజంగా నమ్మకూడదని స్పష్టం చేశారు. షూటింగ్ దశలో ఉండే సినిమాలో రన్ టైమ్ (Run Time)పై ఇప్పుడే ప్రచారం చేయడం తగదు అని, దర్శకుడు బుచ్చిబాబు ఒక పక్కాగా ప్లానింగ్ చేసుకుని సినిమాను రూపొందిస్తున్నారని చెప్పారు.
ఈ చిత్రం ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నది, ప్రేక్షకులను బోర్ చేయకుండా సరైన నిడివితోనే ప్రేక్షకుల ముందుకు రానుందని భరోసా ఇచ్చారు. రామ్ చరణ్ (Ram Charan) మరియు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ అవుతున్నది.







