కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేసిన రష్మిక

కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేసిన రష్మిక

Summarize with AI

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరియు హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం సోషల్ మీడియాలో సునామీ క్రియేట్ చేసింది. పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే నెటిజన్ల నుంచి విపరీత స్పందన అందింది. గంటల్లోనే ఈ పోస్టు 23 మిలియన్లకు (23 Million) పైగా లైకులు(Likes) సొంతం చేసుకొని భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) పెట్టిన రికార్డును అధిగమించింది. గతంలో కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఫోటోతో ఆసియాలో 2 మిలియన్ల లైకులు పొంది ఆసియా చరిత్ర సృష్టించాడు, ఇప్పుడు రష్మిక–విజయ్ జంట ఈ చరిత్రను బ్రేక్ చేసింది.

నెటిజన్‌ రియాక్షన్ చూస్తే, సోషల్ మీడియాలో ‘లైకుల యుద్ధం’ సృష్టవుతోంది. కోహ్లీ అభిమానులు మళ్లీ అతని పోస్టుకు లైక్ పెంచాలని కామెంట్స్ పెడుతున్నారు., అయితే రష్మికకు దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత ఫ్యాన్ బేస్, విజయ్ దేవరకొండతో వారి క్రేజీ కెమిస్ట్రీ, ఆమె ధరించిన బంగారు ఆభరణాలు, ప్రత్యేక లుక్ వంటి అంశాలు ఈ రికార్డు సృష్టించడంలో ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫోటోలు కేవలం ప్రేమకథను మాత్రమే కాక, సోషల్ మీడియా ట్రెండ్‌లో కొత్త చరిత్రను కూడా రూపొందించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment