కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్! కొత్త పేరు ఇదే!?

కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్! కొత్త పేరు ఇదే!?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో (Union Cabinet Meeting) కేరళ రాష్ట్ర (Kerala State) పేరుమార్పు అంశం ప్రధాన చర్చగా మారినట్లు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.

పేరుమార్పు ప్రతిపాదన ఎలా వచ్చింది?
2024లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, అన్ని భాషల్లో రాష్ట్ర పేరును “కేరళ” (Kerala) బదులుగా “కేరళం” (Keralam)గా మార్చాలని కేంద్రానికి పంపింది. మలయాళం (Malayalam language)లో ప్రజలు ఇప్పటికే ‘కేరళం’ అనే పేరునే ఉపయోగిస్తున్నారని, అదే అధికారికంగా ఉండాలని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎన్నికల ముందు నిర్ణయం?
ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోయినా, ఎన్నికల ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అధికారికంగా వెల్లడించనున్నారు.

పేరుమార్పు అమలైతే, దేశంలోని అధికారిక పత్రాలు, కేంద్ర రికార్డులు, పాఠ్యపుస్తకాలు, మ్యాప్స్ అన్నీ కొత్త పేరుతో మారే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment