బిల్ గేట్స్‌కు సుఖ వ్యాధులు.. టీడీపీ మీడియా కథనంపై చ‌ర్చ‌

బిల్ గేట్స్‌కు సుఖ వ్యాధులు.. టీడీపీ మీడియా కథనంపై చ‌ర్చ‌

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌పై అమెరికాలో వెలుగులోకి వస్తున్న పాత పత్రాలు, ఆరోపణల నేపథ్యంలో మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక ఈనెల 1న ప్రచురించిన కథనం సంచలనంగా మారింది.

అమెరికాను కుదిపేసిన Jeffrey Epstein సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కొత్త పత్రాలు బయటకు వచ్చినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించిందని ఆ కథనంలో పేర్కొంది. సుమారు 30 లక్షల పేజీల పత్రాలను తాజాగా బయటపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ పత్రాల్లో బిల్ గేట్స్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇమెయిల్స్‌లో సంచలన వ్యాఖ్యలు?
ఆ కథనం ప్రకారం, ఎపిస్టీన్ తనకు తానే రాసుకున్న ఇమెయిల్స్‌లో గేట్స్ పేరు ప్రస్తావించాడని, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను గేట్స్ కార్యాలయం ఖండించినట్లు కూడా స్పష్టం చేసింది. బిల్ గేట్స్ కార్యాలయం ఈ ఆరోపణలను “అసత్యాలు”గా కొట్టిపారేసిందని అంతర్జాతీయ మీడియా నివేదికలను ఉటంకిస్తూ పేర్కొంది.

ఇతర ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావన
తాజాగా బయటకు వచ్చిన పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ ఆండ్రో, భారత సంతతి అమెరికా దర్శకురాలు మీరా నాయర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్‌ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు కథనంలో ఉంది.

2009 అక్టోబర్ 21న ఎపిస్టీన్ నివాసంలో జరిగిన ఓ విందు అనంతర సమావేశానికి మీరా నాయర్ హాజరైనట్లు పత్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. 2008లో వచ్చిన తన చిత్రం ‘Amelia’ ప్రచారం కోసమే ఆమె ఆ సమావేశానికి వెళ్లినట్లు సమాచారం ఉందని తెలిపింది. అదే సమావేశంలో మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నట్లు కథనంలో ప్రస్తావించింది.

ఏపీ సచివాలయంలో గేట్స్‌కు ఘన స్వాగతం
ఇదిలా ఉంటే, ఈ వివాదాస్పద కథనం ప్రచురితమైన కొద్ది రోజులకే బిల్ గేట్స్ ఏపీ సచివాలయాన్ని సందర్శించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులతో గేట్స్ సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, సాంకేతికత, ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్గాలు గేట్స్‌ను సాంకేతిక విజ్ఞానంలో ఆదర్శంగా పేర్కొంటూ ఘన స్వాగతం పలికాయి. అయితే, ఇదే సమయంలో టీడీపీ అనుకూలంగా భావించే మీడియా సంస్థలో వచ్చిన ఆరోపణాత్మక కథనం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

రాజకీయ విభేదాల కేంద్రబిందువుగా మారిన అంశం
ఒకవైపు ఆరోపణలతో కూడిన అంతర్జాతీయ వివాదం… మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అధికారిక ఆతిథ్యం… ఈ రెండు పరిణామాలు కలిపి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా కథనాలు, అంతర్జాతీయ న్యాయపరమైన ప్రక్రియలు, అధికారిక ఖండనలు – ఇవన్నీ కలిసి ఈ అంశాన్ని మరింత సున్నితంగా మారుస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment