దళపతి విజయ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

దళపతి విజయ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ చివరికి విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగ్ వివాదాల కారణంగా సినిమా విడుదల పై సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 20న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సెన్సార్ బోర్డు వద్ద కొత్త వెర్షన్ సమర్పించి, కోర్టు కేసులను ఉపసంహరించుకోవడానికి యూనిట్ చర్యలు చేపట్టినట్లు సినీ సర్కిళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు.హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఆయన రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందే చేస్తున్న చివరి సినిమా కావడంతో, అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడినాయి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమితా బైజు కీలక పాత్రలో నటించనున్నారు.

సినిమా సంగీతం అనిరుధ్ అందించగా, ఆయన పవర్‌ఫుల్ పొలిటికల్ స్పీచ్‌లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని టాక్. డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.121 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తమిళ్ రూ.64 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. వివాదాలు పరిష్కారమైతే, ఫిబ్రవరి 20న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించనుందని నమ్మకంగా చెప్పవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment