ఫ్లాపుల తర్వాత నితిన్‌కు కొత్త ఆశ…

ఫ్లాపుల తర్వాత నితిన్‌కు కొత్త ఆశ…

వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న యంగ్ హీరో నితిన్, తాజాగా ఒక కొత్త ఆశాజనకమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ‘తమ్ముడు’ డిజాస్టర్ తర్వాత ఇప్పటికే కమిట్ అయిన కొన్ని సినిమాలను కూడా క్యాన్సిల్ చేసిన నితిన్, లాంగ్ గ్యాప్ తీసుకుని కథలు వింటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో గోదావరి నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆయ్’ సినిమాతో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అంజి తాజాగా నితిన్‌ను కలిసి ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ వినిపించాడట. అంజి చెప్పిన పాయింట్ నచ్చడంతో నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా కూడా వినోదంతో పాటు కొత్తదనం కలిగిన కథాంశంతో రూపొందనుందని టాక్.

ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. ‘ఆయ్’ వంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడితో పని చేయాలనే ఆలోచనతో పాటు కథపై నమ్మకంతో సొంత బ్యానర్‌లోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 36వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఆ సినిమా పూర్తి అయిన వెంటనే అంజితో సినిమా ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నాడట. భీష్మ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు విఐ ఆనంద్ లేదా అంజి ఎవరు కంబ్యాక్ హిట్ ఇస్తారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment