తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించడమే కాకుండా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అంగీకరించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్‌తో కీలక భేటీ జరిపారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ భేటీ అనంతరం రామచందర్ రావు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్‌తో విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించారని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే అంచనాలు ఊపందుకోగా, బీజేపీకి ఇది కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు