ఛాన్స్ దొరికిన ప్రతీసారి నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) డైరెక్టర్ త్రివిక్రమ్, నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. తాజాగా నాందేడ్ (Nanded)లోని గురుద్వారాను పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా (Anna Lezhneva) సందర్శించిన సందర్భంగా వెలువడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వాటిపై స్పందించిన పూనమ్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ కల్యాణ్‌ను “మతమార్పిడులకు (Religious Conversions) బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించిన ఆమె, ట్విట్టర్ (Twitter) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవ మతంలోకి మార్చుకున్న వ్యక్తి, సిక్కుల మతానికి చెందిన గురుతేగ్ బహదూర్ జీ (Guru Tegh Bahadur Ji)ను ప్రార్థించాల్సిన చివరి వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆమె ట్వీట్ చేశారు.
పూనమ్ వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని, పవన్ ఎవరినీ మతమార్పిడి చేయించలేదని, ఆయన పిల్లల్లో ఇద్దరు హిందువులేనని కౌంటర్ ఇచ్చారు. దీనికి పూనమ్ బదులిస్తూ మరింత తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. “అదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు. సిగ్గుచేటు!” అంటూ ఆమె చేసిన పోస్ట్ కలకలం రేపింది.
ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ అభిమానులు పూనమ్ కౌర్ వ్యాఖ్యలను ఖండిస్తూ స్పందిస్తుండగా, మరికొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. వరుస ట్వీట్లతో పూనమ్ కౌర్ రేపిన ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.









