అనిల్‌కి చిరంజీవి ఖరీదైన కానుక.. కారు ధ‌ర ఎంతో తెలుసా..?

అనిల్‌కి చిరంజీవి ఖరీదైన కానుక.. కారు ధ‌ర ఎంతో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది. సంక్రాంతి సంద‌ర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi)కి చిరంజీవి ప్రత్యేకమైన గిఫ్ట్‌ (Special Gift)తో సత్కరించారు.

సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవి, అనిల్ రావిపూడికి అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్ (Ultra-Premium Range Rover Sport) కారును బహుమతిగా అందించారు. ఈ లగ్జరీ కార్ మార్కెట్ విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. సినిమా ఇచ్చిన ఘన విజయానికి గుర్తుగా చిరు ఇచ్చిన ఈ ఖరీదైన కానుక సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కారు గిఫ్ట్ ఇచ్చే సందర్భంగా చిరంజీవి అనిల్ రావిపూడికి ప్రత్యేక సూచనలు చేశారు. “ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి.. సేఫ్టీనే మొదటి ప్రాధాన్యం.. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి” అంటూ చిరు సూచించగా, అనిల్ తనదైన స్టైల్‌లో సినిమా డైలాగ్‌తో స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఘన విజయానికి గుర్తుగా చిరంజీవి ఇచ్చిన ఖరీదైన కానుక ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment