కొడుకును కాపాడబోయి.. బావిలో ప‌డి తండ్రీకొడుకులు మృతి

కొడుకును కాపాడబోయి.. బావిలో ప‌డి తండ్రీకొడుకులు మృతి

మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి (Father) కూడా ప్రాణాలు కోల్పోవడంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది.

మహబూబాబాద్ మండలం బలరాం తండా (Balaram Thanda)లో వ్యవసాయ బావి (Agricultural Well) వద్దకు వెళ్లిన కేలోత్ మదన్ (Keloth Madan (40), అతని రెండేళ్ల కుమారుడు జస్వంత్ (Jaswanth) ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన తండ్రి మదన్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుమారుడిని కాపాడేందుకు బావిలోకి దూకాడు. అయితే, లోతైన బావి కావడంతో ఇద్దరూ బయటకు రాలేకపోయారు.

సమాచారం అందుకున్న తండావాసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం తండ్రి మదన్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే, బాలుడు జస్వంత్ మృతదేహం కోసం బావిలో ఇంకా గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటనతో బలరాం తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment