టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి షాక్.. గోవాలో గంగారాం అరెస్ట్‌

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి షాక్.. గోవాలో గంగారాం అరెస్ట్‌

రోజుకో కొత్త వివాదంతో టీడీపీ (Telugu Desam Party) ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ (Daggupati Prasad) వార్త‌ల్లో నిల‌వాల్సిందే. బెదిరింపులు, బూతుల ఆడియోల‌తో వెంట‌నే అడ్డంగా దొరికిపోవ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. సెలబ్రెటీల‌ను, వ్యాపారుల‌ను, మ‌హిళ‌ల‌ను, సామాన్య ప్ర‌జ‌ల‌ను బండ‌బూతులు తిట్టినా, పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే ప‌నులు చేసినా, ఆయ‌న‌పై కేసులుండ‌వూ.. చ‌ర్య‌లు అంత‌క‌న్నా ఉండ‌వూ. అందుకు ఎన్టీఆర్ వార్‌-2 సినిమాను అడ్డుకునే ఉదంతం నుంచి ఎగ్జిబిష‌న్ నిర్వ‌హ‌కుడికి బెదిరింపు, నంబూరి వైన్స్‌కు నిప్పు, అస్ర క్లీనిక్ డాక్ట‌ర్‌ ఆడియో క్లిప్ వ‌ర‌కు జ‌రిగి ఉదాహ‌ర‌ణ‌లే సాక్ష్యాలు. మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు స‌న్నిహితుడు కావ‌డంతోనే ద‌గ్గుపాటి ప్ర‌సాద్‌పై చ‌ర్య‌లుండ‌వ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, అనంతపురం అర్బన్ టీడీపీ(TDP) ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఖ్య అనుచరుడిగా పేరున్న టీడీపీ నేత గంగారాం (Gangaram)ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. గంగారాం‌ను గోవా నుంచి అనంతపురానికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశాలతో గంగారాం గత కొంతకాలంగా పంచాయితీలు, సెటిల్మెంట్లు నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకులు తాము అడిగిన‌ రూ.10 ల‌క్ష‌లు ఇవ్వలేదన్న కారణంతో వారిపై దాడికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టిన ఘటనలో కూడా గంగారాం, ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. నంబూరి వైన్స్ (Namburi Wines) నిర్వాహకుడు వెంకట రమణ (Venkata Ramana) మాట్లాడుతూ.. రూ.20 లక్షలు ఇవ్వాలని, వైన్ షాపును తమకు అప్పగించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తమను బెదిరించారని ఆరోపించారు.

ఎమ్మెల్యేపై చ‌ర్య‌లేవీ..?
అయితే, గంగారాం అరెస్టుతో వ్యవహారం అక్కడితోనే ఆగిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బాధితులు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేపైనే ఆరోపణలు చేసినప్పటికీ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగానే కేసును గంగారాం వరకే పరిమితం చేశారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి, డబ్బుల బెదిరింపులు, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే పాత్రపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment