గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) సరసన ‘ది రాజా సాబ్’ వంటి భారీ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నిధి… ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఇండస్ట్రీలో తనపై పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తన కెరీర్‌ను దెబ్బతీయడానికి డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. నటీనటులు చాలా ఎమోషనల్‌గా ఉంటారని, ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల వారి కుటుంబాలు కూడా తీవ్రంగా బాధపడతాయని నిధి ఆవేదన వ్యక్తం చేసింది.
అదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఆమె ఖండించింది. వరుణ్ ధావన్ చాలా స్వీట్ వ్యక్తి అని, కో-స్టార్స్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాడని చెప్పింది. అలాగే కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాడని గుర్తు చేసింది. హైదరాబాద్ మాల్ ఈవెంట్‌లో తన డ్రెస్సింగ్‌పై వచ్చిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన నిధి… బాధితురాలినే తప్పుబట్టడం మానిపులేషన్ అని స్పష్టం చేసింది. కాశీ యాత్ర (Kashi Yatra) తర్వాత తనలో ఆధ్యాత్మిక మార్పు వచ్చిందని, ఎన్ని నెగిటివ్ క్యాంపెయిన్‌లు ఎదురైనా ధైర్యంగా నిలబడతానని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.







