సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్‌ను గట్టిగా నిలబెట్టారు. దావోస్ (Davos)లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ (Join the Rise) కార్యక్రమంలో ఆయన చేసిన కీలక ప్రతిపాదనకు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలన్న సూచన పెట్టుబడుల ప్రక్రియను వేగవంతం చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని, ఇప్పుడు తెలంగాణ విజన్‌ను ప్రపంచానికి చూపించేందుకే దావోస్‌కు వచ్చామని ఆయన చెప్పారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCCs) హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నైట్ టైమ్ ఎకానమీతో పాటు దేశంలోనే తొలి 24 గంటలు పనిచేసే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, 50 శాతం గ్రీన్ కవర్‌తో స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అదే వేదికపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్, AI ఇన్నోవేషన్ హబ్, నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ నటుడు చిరంజీవి హాజరు ఈ కార్యక్రమానికి మరింత గ్లామర్‌ను తీసుకొచ్చింది.








