మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao)కు సిట్ నోటీసుల అంశంపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) అనేది “లొట్టపీసు కేసు” అని వ్యాఖ్యానించారు. విచారణలు, కమిషన్ల పేరుతో బీఆర్‌ఎస్ నేతలను రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే హరీష్‌రావుకు నోటీసులు జారీ చేశారని, ఎన్ని విచారణలైనా తమ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. అవసరమైతే కేసీఆర్(KCR)కు కూడా నోటీసులు ఇవ్వాలని సవాల్ విసిరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయని గుర్తుచేసిన కేటీఆర్.. అయినా ఎంక్వైరీల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy)పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణిలో దోపిడీ మొదలైందని, కోల్ టెండర్లలో సీఎం బావమరిది సృజన్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సింగరేణి స్కామ్‌ను ఆధారాలతో బయటపెడతానని ప్రకటించిన కేటీఆర్.. నైని కోల్ బ్లాక్ రద్దు వెనుక వాటాల పంచాయితీ ఉందన్నారు. అసెంబ్లీలో హరీష్‌రావు మంత్రులను ‘ఫుట్‌బాల్ ఆడుకున్నారనే’ అక్కసుతోనే నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.








