‘జనసేన నేత నన్ను శారీరకంగా వాడుకొని మోసం చేశాడు’ – మహిళ ఫిర్యాదు

'జనసేన నేత నన్ను శారీరకంగా వాడుకొని మోసం చేశాడు' - మహిళ ఫిర్యాదు

ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణగా నిలుస్తామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓవైపు చెబుతుంటే ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం తద్భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి (Anakapalli) జిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్‌ సూర్యచంద్ర (Suryachandra) వ్యవహారం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన మోసం చేశాడంటూ ఓ మహిళ చేసిన వీడియో వైరల్ గా మారింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారంటూ లావణ్య (Lavanya) అనే మహిళ నాతవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూర్యచంద్ర కోసం తన వైవాహిక బంధాన్ని సైతం తెంచుకుని వచ్చానని, ఆ తర్వాత మోసానికి గురయ్యానంటూ లావణ్య సదరు వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను విచారణకు పిలిపించగా, కేసు నమోదు ప్రక్రియపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, లావణ్య కొద్ది గంటల వ్యవధిలోనే రెండో వీడియో విడుదల చేసి మరో ట్విస్ట్ ఇచ్చింది. సమస్యను పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని, తన మొదటి వీడియో ఎలా బయటకు వచ్చిందో కూడా తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, అప్పటికే లావణ్య మొదటి వీడియో వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ (Jana Sena Party) దీనిపై స్పందించింది. సూర్యచంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళలకు రక్షణగా నిలుస్తామని చెబుతుంటే, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇలా మహిళల్ని మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవహారం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment