దావోస్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

దావోస్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Summarize with AI

తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ (Davos)కు బయలుదేరింది. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)–2026 సదస్సులో పాల్గొనున్న బృందం. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047లోని ఉద్దేశాలు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అలాగే జనవరి 20న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీతో పాటు తెలంగాణ ఏఐ హబ్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

దావోస్ సదస్సులో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధికి అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, 2047 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై పెట్టుబడిదారులకు వివరించనున్నారు. తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, హనీవెల్, ఎల్–ఓరియల్, నోవార్డిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశాలు నిర్వహించనున్నారు. పలు రౌండ్‌టేబుల్ భేటీల్లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ‘క్యూర్, ప్యూర్, రేర్’ విధానాలపై దృష్టి సారించిన అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment