TVK విజయ్‌కి CBI నోటీసులు.. కరూర్ తొక్కిసలాట కేసులో కీల‌క‌ మలుపు

TVK విజయ్‌కి CBI నోటీసులు.. కరూర్ తొక్కిసలాట కేసులో కీల‌క‌ మలుపు

Summarize with AI

తమిళనాడులో గతేడాది సంచలనం సృష్టించిన కరూర్ (Karur) తొక్కిసలాట ఘటన మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) తాజాగా తమిళ వెట్రి కళగం (Tamil Vetri Kazhagam – TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay)కి నోటీసులు జారీ చేసింది. సీబీఐ అధికారులు పంపిన నోటీసుల్లో, విజ‌య్‌ ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను విచారించే అవకాశమున్న‌ట్లుగా స‌మ‌చారం. ఈ పరిణామం తమిళ రాజకీయాలు, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లా వేలుసామిపురం (Velusamipuram)లో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో దళపతి విజయ్‌ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రారంభంలో ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలనే డిమాండ్లు పెద్దఎత్తున వెల్లువెత్తాయి.

సుప్రీంకోర్టు జోక్యం.. CBIకి కేసు బదిలీ
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు (Supreme Court of India) జోక్యం చేసుకుని, గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాదు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (Justice Ajay Rastogi) నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు విజయ్‌కు నోటీసులు జారీ కావడంతో, ఈ కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment