“మ‌మ్మ‌ల్ని లైట్ తీసుకుంటే మీకే నష్టం” – సీఎం రేవంత్‌కు సీపీఐ ఎమ్మెల్యే హెచ్చ‌రిక‌

“మ‌మ్మ‌ల్ని లైట్ తీసుకుంటే మీకే నష్టం” - సీఎం రేవంత్‌కు సీపీఐ ఎమ్మెల్యే హెచ్చ‌రిక‌

తెలంగాణ (Telangana) సీఎం (CM) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఉద్దేశించి సీపీఐ ఎమ్మెల్యే (CPI MLA) కూనమినేని సాంబశివరావు (Koonameni Sambasiva Rao) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ భాష తీరు మార్చుకోవాలని సూచించిన ఆయన, లెఫ్ట్ పార్టీలతో స్నేహపూర్వకంగా వ్యవహరించటం కాంగ్రెస్ ప్రభుత్వానికే మేలని స్పష్టం చేశారు. మిత్ర‌ప‌క్షం ఓట్లు చాలా విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌ (Congress)కే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

“వాళ్లేంతలే” అనే ధోరణితో వ్యవహరిస్తే మహారాష్ట్ర (Maharashtra) తరహా పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని కూనమినేని హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ముక్కలు ముక్కలైన ఉదాహరణను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు మాత్రమే లెఫ్ట్ పార్టీలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని, దాదాపు 90 శాతం మంది ఎమ్మెల్యేలు వామపక్షాలను పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు సింబల్స్ లేకుండా జరిగినప్పటికీ, రాబోయే రోజుల్లో సింబల్స్‌తో జరిగే ఎన్నికలు తప్పవని కూనమినేని అన్నారు. అలాంటి ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్నేహపూర్వకంగా ఉంటే కాంగ్రెస్‌కు లాభం ఉంటుందని, లేకపోతే రాజకీయంగా నష్టం ఎదురవుతుందని హెచ్చరించారు. అందుకే లెఫ్ట్ పార్టీలను పిలిచి రాబోయే ఎన్నికలపై చర్చించాలని ఆయన సూచించారు.

నల్గొండ జిల్లా మినహా రాష్ట్రంలోని చాలా చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి తమకు సరైన మద్దతు లభించలేదని కూనమినేని ఆరోపించారు. కొత్తగూడెంలో అయితే కనీస మద్దతు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వామపక్షాలు పొత్తు ధర్మాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా సర్పంచ్ పదవులు, వందకు పైగా ఉపసర్పంచ్ పదవులు, వెయ్యికి పైగా వార్డులను తాము గెలుచుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశాన్ని గమనించి వామపక్షాలతో సంబంధాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment