భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో బిగ్‌ట్విస్ట్..

భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో బిగ్‌ట్విస్ట్..

Summarize with AI

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు (Madhavi Murder Case)లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి కోర్టులో కొనసాగుతున్న రోజువారీ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు 36 మంది సాక్షులను పోలీసులు నమోదు చేయగా, 20 మంది సాక్షుల విచారణ పూర్తైంది. ట్రయల్ సందర్భంగా నిందితుడు గురుమూర్తి (Gurumurthy)కి తన మరదలితో (Sister-in-law) వివాహేతర సంబంధం (Extra-Marital Affair) ఉన్నట్టు బయటపడటం ఈ కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది.

ఈ వివాహేతర సంబంధం కారణంగా గురుమూర్తి, మాధవి మధ్య తరచూ గొడవలు జరిగేవని కోర్టుకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు, పెద్దలు పలుమార్లు పంచాయితీలు చేసినప్పటికీ గురుమూర్తి ప్రవర్తనలో మార్పు రాలేదని సాక్ష్యాల ద్వారా వెల్లడైంది. ఇదే కారణంగా భార్యను అడ్డుగా భావించిన గురుమూర్తి ఆమెను హత్య చేసినట్లు అభియోగ పక్షం పేర్కొంది. ఈ ఘటన ఈ ఏడాది జనవరి నెలలో జరిగినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గురుమూర్తి, మాజీ ఆర్మీ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. అనంతరం హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేశాడు. గురుమూర్తి భార్య ని అడ్డు తొలగించుకోవడం కోసం అతిక్రూరంగా తన భార్యను హతమార్చి శరీరాన్ని ముక్కలుగా నరికి, ఉడకబెట్టి ఎముకలను కాల్చి. ఆ పొడిని చెరువులో విసిరేశాడు. ఎవరీకీ అనుమానం లేకుండా జాగ్రత్తగా పడ్డాడు. అయితే, ఇంట్లో దొరికిన కొన్ని టిష్యూస్ ముక్కల ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించగలిగారు. క్లూస్ టీమ్ ఆ టిష్యూస్‌ని డీఎన్ఏ కోసం పరిశీలించగా, ఫోరెన్సిక్ పరీక్షల్లో మాధవి డీఎన్ఏ తల్లి, పిల్లల డీఎన్ఏతో సరిపోయినట్లు తేలింది. ఈ కేసులో న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగా, తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment