వైఎస్సార్ సీపీ (YSRCP) నాయకుడు స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి (Y.S. Vivekananda Reddy) హత్య కేసులో (Murder Case) తాజాగా సీబీఐ కోర్టు (CBI Court) ఆర్డర్ కాపీలో (Order Copy) కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సునీత తరఫు న్యాయవాది చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టంగా పేర్కొంది. జగన్, వివేకా మధ్య విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలను సమర్థించే సాక్ష్యాలు దర్యాప్తులో బయటపడలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
వివేకానందరెడ్డి మరణించిన వెంటనే ఆయన బంధువులకు సమాచారం ఇవ్వడం సహజమేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్(Charge Sheet)లో కూడా వైఎస్ జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని కోర్టు గుర్తుచేసింది.
హత్య జరిగిన రోజు ఉదయం జగన్‌కు వచ్చిన ఫోన్ కాల్‌పై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని ఆర్డర్ కాపీలో స్పష్టంగా పేర్కొంది.








