రఘురామకు సుప్రీంకోర్టు భారీ షాక్!

రఘురామకు సుప్రీంకోర్టు భారీ షాక్!

ఇండ్‌ భారత్‌ బ్యాంకు మోసాల కేసు (Ind-Bharat Bank Fraud Case)లో ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ కృష్ణరాజుకు (AP Deputy Speaker Raghurama Krishnam Raju) సుప్రీంకోర్టు (Supreme Court of India)భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసం చేసిన ఆరోపణలపై సీబీఐ(CBI) దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో రఘురామ కృష్ణరాజు, వాకాటి నారాయణ రెడ్డి (Vakati Narayana Reddy) కంపెనీలపై సీబీఐ దర్యాప్తున‌కు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.

బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో సీబీఐ దర్యాప్తుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (Chief Justice Suryakant) ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు నిందితులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. నోటీసులు ఇవ్వలేదన్న ఒక్క కారణంతో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన కేసులు చెల్లుబాటవుతాయని పేర్కొంది.

అయితే ఖాతాల ఫ్రాడ్‌, ఇతర సాంకేతిక అంశాలపై సంబంధిత న్యాయస్థానాల్లో సవాల్‌ చేసుకునే స్వేచ్ఛ నిందితులకు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయినప్పటికీ ఫోర్జరీ పత్రాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై సీబీఐ వేగవంతమైన దర్యాప్తు చేపట్టేందుకు ఇక ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

బ్యాంకుల కన్సార్షియం నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని నిధులను దారి మళ్లించారన్న ఆరోపణలు రఘురామ కృష్ణరాజు కంపెనీలపై ఉన్నాయి. గతంలో తీసుకున్న రుణాలను ఎఫ్‌డీలుగా మార్చి, వాటిపైనే మళ్లీ రుణాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా బ్యాంకు మోసాల కేసుల్లో కీలక మైలురాయిగా మారనుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment