నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Tandavam) బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సనాతన ధర్మం, హిందుత్వం వంటి అంశాలను ఆవిష్కరించిన ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీ ఆఫీసర్‌తో ఐటమ్ సాంగ్ తీవ్ర చర్చనీయాంశం కాగా, బాలకృష్ణ నటన, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయని సినీ వర్గాల అభిప్రాయం. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్లో దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
సక్సెస్ మీట్ వేదికగా బోయపాటి మాట్లాడుతూ.. “ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ‘అఖండ 2’ గురించి విని సినిమాపై ఆసక్తి వ్యక్తం చేశారు. త్వరలో ఢిల్లీలో (Delhi) ఈ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఆ షోను ప్రధాని మోడీ కూడా వీక్షించనున్నారు” అని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. ఢిల్లీలో జరగనున్న స్పెషల్ షో తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని కూడా తెలిపారు.








