సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య

సర్పంచ్ ఎన్నికల ప్రచారం (Sarpanch Election Campaign) సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. సూర్యాపేట (Suryapet) జిల్లా నూతనకల్ మండలం (Nuthankal Mandal) లింగంపల్లి (Lingampalli) గ్రామంలో ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామంలో బీఆర్ఎస్‌(BRS)కు చెందిన కార్య‌కర్త ఉప్పల మల్లయ్య (Uppala Mallayya) (ఆదివాసి నాయకుడు)ను కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చెందిన నాయకులు, కార్యకర్తలు అతి కిరాత‌కంగా కొట్టి చంప‌డంతో సూర్యాపేట‌ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.

స‌ర్పంచ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా గ్రామంలో రాత్రి వేళ ఇంటింటికీ తిరిగి ఓట్లు కోరుతున్న సమయంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. స్థానిక రాజకీయ ఉద్వేగాలు, ఎన్నికల పోటీ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా తీవ్రమైంది. వాగ్వాదం త్వరలోనే తోపులాటకు, అనంతరం హింసాత్మక దాడికి దారి తీసింది.

కర్రలతో దాడి – ఏడుగురు గాయాలు
ఇద్దరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పరిస్థితి నియంత్రణ తప్పింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్యతో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మల్లయ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మల్లయ్య మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు
లింగంపల్లిలో ఏర్పడిన అల్లర్లతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీసంఖ్యలో బలగాలను మోహరించారు. ఘర్షణకు కారణాలు, నిందితుల వివరాలు, ఇరు వర్గాలపై నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment