తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షురూ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షురూ

రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) ఈ రోజు (డిసెంబర్ 8) మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్యూచర్ సిటీ (Future City)లో ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులను తలపించేలా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల దిగ్గజాలు హాజరవుతున్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుని, సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం 1.30 గంటలకు జరిగే ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయాలను వివరించడంతో పాటు, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం రూపొందించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ఆవిష్కరిస్తారు.

ప్రారంభోత్సవం అనంతరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధి బృందాలతో బిజీబిజీగా గడుపుతారు. ప్రతి 15 నిమిషాలకో వన్-టు-వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ చొప్పున, సీఎం దాదాపు 15 కీలక సమావేశాల్లో పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ట్రంప్ మీడియా, అమెజాన్, ఐకియా వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ భేటీల్లో పాల్గొంటారు. దీంతో పాటు, టెక్స్‌టైల్, ఫర్నిచర్ తయారీ MSMEలు, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల ప్రతినిధులు, అలాగే వరల్డ్ బ్యాంక్, SIDBI, వివిధ దేశాల రాయబారులతోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. తొలి రోజు షెడ్యూల్ రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందుతో ముగుస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment