‘క్ష‌మాప‌ణ చెప్పేవ‌ర‌కు ప‌వ‌న్ సినిమాలు ఆడ‌నివ్వ‌ను’

'క్ష‌మాప‌ణ చెప్పేవ‌ర‌కు ప‌వ‌న్ సినిమాలు ఆడ‌నివ్వ‌ను'

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను బాధించాయని, ఇప్పటికీ ఆయన క్షమాపణ చెప్పకపోవడం ఆశ్చర్యకరమని అనిరుధ్‌ రెడ్డి మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు బాధాకరమైనవని, ఆయన స్పందించకుండా ఉండడం సరైంది కాదని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను చులకన చేసేలా ఉన్నాయని, “తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా?” అని అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం తప్పు అని ఆయన స్పష్టం చేశారు. పవన్ క్షమాపణ చెప్పేంతవరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన సినిమా ప్రదర్శించనివ్వరని కూడా హెచ్చరించారు. “నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అయినా, తెలంగాణను తక్కువగా చూస్తే సహించేది కాదు” అని చెప్పారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సినిమా పరిశ్రమలో రేట్లు పెంచాలంటే 20% కార్మికులకు ఇవ్వాలనే నిబంధనపై జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో అన్ని ఎమ్మెల్యేలూ ఒకే తాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు నేతలు స్పందించిన నేపథ్యంలో, వారందరికీ తన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే ఏ వ్యాఖ్యనైనా రాష్ట్ర ప్రజలు క్షమించబోరని, రాష్ట్ర భావజాలానికి విరుద్ధంగా ఉన్న వ్యాఖ్యలను ఎవరి నుండి వచ్చినా ఎదిరిస్తామని అనిరుద్ రెడ్డి హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment