టీమిండియా (Team India) యువ క్రికెటర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) టీ20 ఫార్మాట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy-2025)లో త్రిపుర (Tripura)తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సెంచరీతో, టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ మూడు సెంచరీలు నమోదు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్, పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఈ డబుల్ రోల్‌లో రెండేసి సెంచరీలు మాత్రమే సాధించారు.
ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, కీపర్‌గా సాధించిన ఈ మూడో సెంచరీతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో లక్ష్య ఛేదనలో భాగంగా త్రిపుర నిర్దేశించిన 183 పరుగుల టార్గెట్‌ను జార్ఖండ్ 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌కు విరాట్ సింగ్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో అండగా నిలిచాడు. ఈ అసాధారణ ప్రదర్శనకు ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు