ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు ఎండలు మండిపోతుండగానే, ఇటు ద్రోణి ప్రభావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ జిల్లాల్లో వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పోలవరం ప్రాంతాలు, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. శుక్ర, శనివారాల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు ప్రారంభమయ్యాయి.

మరోవైపు మండుతున్న ఎండలు
వర్ష సూచన ఉన్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. అధిక వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment