ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ (Government) ఖజానాకు (Treasury) రూ.కోట్లలో గండిపడుతున్న మరో తాజా అంశం రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన అనుచరుల కేసులు వాదించే సీనియర్ ప్రైవేట్ లాయర్ (Lawyer) సిద్ధార్థ లూథ్రాకు (Siddharth Luthra) ప్రభుత్వం కోట్ల రూపాయలు ఫీజులుగా చెల్లిస్తున్నట్లు బయటపడింది. ఈ 18 నెలల కాలంలో దాదాపు రూ.8.36 కోట్లు ఫీజు రూపంలోనే చెల్లించినట్లుగా ప్రభుత్వ ఆర్డర్స్ వెల్లడిస్తున్నాయి.
గతంలో స్కిల్ స్కామ్ (Skill Scam) కేసులో చంద్రబాబు తరపున వాదించి బెయిల్ మంజూరు కృషిచేసిన లూథ్రా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి (TDP Government) ‘అస్థాన న్యాయవాది’గా మారిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లూథ్రా ఒక్కరోజు ఒక కేసులో హాజరైనందుకు ఆయనకు రూ.11 లక్షలు (జీఎస్టీతో కలిపి) వసూలు చెల్లిస్తున్నట్లుగా వెల్లడవుతోంది. నిన్న ఒక్క రోజే రూ.1.15 కోట్లు విడుదల చేస్తూ రెండు ఆర్డర్స్ విడుదలవ్వడం గమనార్హం.

చంద్రబాబుపై గతంలో నమోదైన స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అమరావతి అసైన్‌డ్ ల్యాండ్స్, ఫైబర్ నెట్, లిక్కర్ వంటి పలు కేసుల్లో సీఐడీ గత ప్రభుత్వ కాలంలో బలమైన సాక్ష్యాధారాలు చూపింది. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇవన్నీ వాదించేందుకు లూథ్రానే న్యాయవాదిగా వ్యవహరిస్తుండడంతో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఫీజుల రూపంలో ఆయనకు వెళ్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఇంటివద్ద జరిగిన ఘర్షణ కేసు విచారణకే ఇప్పటికే రూ.60 లక్షల కన్నా ఎక్కువ ఫీజులు చెల్లించినట్లు సమాచారం.

అంతేకాకుండా టీడీపీ నేతల వ్యక్తిగత, రాజకీయ, చట్టపరమైన కేసులన్నింటినీ లూథ్రాకే అప్పగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, మార్గదర్శి కేసు, వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత తరఫు వాదనలు, తిరుమల లడ్డూ ఇలా చాలావరకు అన్ని కేసుల్లోనూ లూథ్రానే ముందుకు వస్తున్నారు. వైసీపీ నేతలపై పెట్టిన పలు కేసుల్లో కూడా ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా హాజరవుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రజలు, న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక వ్యక్తి, ఒకే పార్టీకి సంబంధించిన కేసుల కోసం ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంపై విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.








