తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి (Lord Venkateswara Darshan) వెళ్లిన అనంతరం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, నటి, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి (Shivajyothi) బహిరంగంగా క్షమాపణ చెప్పారు. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లిన సందర్భంగా ఆమె “తిరుమల (Tirumala)లో కాస్ట్లీ ప్రసాదం (Costly Prasadam) అడుక్కుంటున్నాం… రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం (Richest Beggars) మేమే” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో శివజ్యోతి స్వయంగా వీడియో విడుదల చేసి తన మనసులోని మాటలను వెల్లడించారు.
శివజ్యోతి మాట్లాడుతూ.. “వేంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంత ప్రేమో, నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు. నా మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు (Apologies) చెబుతున్నా” అని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాదని, తెలియక మాట్లాడిన మాటలని వివరించారు. తనతో పాటు వీడియోలో కనిపించిన తన తమ్ముడి తరపున కూడా సారీ చెబుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇకపోతే, భక్తుల భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం అస్సలు లేదని, తిరుమలపై తాను కలిగిన భక్తిని ఎవరైనా ప్రశ్నించాల్సిన అవసరం లేదని శివజ్యోతి తెలిపారు. చిన్న పొరపాటుకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు మరోసారి పునరుద్ఘాటించారు.








