బీఆర్ఎస్‌ను మోసం చేసింది హరీష్ రావే: కవిత

బీఆర్ఎస్‌ను మోసం చేసింది హరీష్ రావే: కవిత

జాగృతి అధినేత్రి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మెదక్ తలసరి ఆదాయం పెరగకపోవడానికి, పాల రైతులు నష్టపోవడానికి కారణం హరీష్ రావు, ఆయన సతీమణి నడుపుతున్న ప్రైవేట్ పాల వ్యాపారమే అని కవిత ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు పాలు పోసి వారు భారీగా లాభాలు పొందారని విమర్శించారు. ముఖ్యమంత్రి PRO అయిన అయోధ్య రెడ్డి సైతం హరీష్ రావు పాల వ్యాపారం అక్రమమని చెప్పినప్పటికీ, ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. హరీష్ రావు ఇన్ని అరాచకాలు, అక్రమాలు చేస్తున్నా సీఎంకు ఎందుకు కనపడటం లేదని నిలదీస్తూ, హరీష్ రావుకి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఒప్పందం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కుట్రలు జరిగాయని ఆరోపించిన కవిత, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు. పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుంటూ, హరీష్ రావు బీఆర్ఎస్‌ను మోసం చేశారని కవిత వ్యాఖ్యానించారు. ఒక సభ సక్సెస్ కాగానే కేటీఆర్ కేసీఆర్ ఫోటోను నెత్తిపై పెట్టుకుని తానే చేశాను అనుకున్నారని, అలాగే హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్లు బిల్డప్‌లు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

మెదక్‌లో పద్మా దేవేందర్ రెడ్డి అక్రమాలకు హరీష్ రావు సపోర్ట్ చేశారని ఆరోపిస్తూ, కేటీఆర్, హరీష్ రావులు ‘కృష్ణార్జునులు’ అనే బిల్డప్‌లు ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లకు వీళ్ళు ట్వీట్‌లు చేసుకోవడం తప్ప, ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడం తప్ప పార్టీ కోసం ఏమీ చేయడం లేదని కవిత ఘాటుగా విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment