రేణు దేశాయ్ ఆ పోస్ట్ వైరల్..

రేణు దేశాయ్ ఆ పోస్ట్ వైరల్..

సినిమాల్లో నటించినా, నటించకున్నా… తనదైన లైఫ్‌స్టైల్, ఆలోచనలతో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం ఆమె పాపులారిటీకి నిదర్శనం. ఆధ్యాత్మికతపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న రేణు తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ, పిల్లలకు కూడా భారతీయ సంప్రదాయ విలువలను నేర్పుతూ ఉంటారు. గతంలో ఆమె భవిష్యత్తులో సన్యాసం తీసుకోవచ్చని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా, ఆమె షేర్ చేసిన ఒక ఆధ్యాత్మిక పోస్ట్ సోషల్ మీడియాలో మళ్లీ ఆసక్తిని పెంచింది.

తాజాగా కాల భైరవ జయంతి సందర్భంగా కాశీకి వెళ్లిన రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు. మనమే రక్షకులుగా మారాలి. ఆ పరమేశ్వరుడు పిలిస్తే, మనం అన్ని వదిలేసి కాశీకి వెళ్లాలి” అని ఆమె పోస్ట్ చేశారు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ఆమె గతంలో సన్యాసంపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment