తెలుగు తెరపై ట్రెడిషనల్ బ్యూటీగా, హోమ్లీ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను కట్టిపడేస్తున్న హీరోయిన్ రితిక నాయక్ (Ritika Naik) ప్రస్తుతం సూపర్ జోష్‌లో ఉంది! విశ్వక్ సేన్ (Vishwak Sen) సరసన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ సుందరి, తాజాగా తేజా సజ్జాతో కలిసి నటించిన ‘మిరాయ్’ (Mirai) బ్లాక్‌బస్టర్ హిట్‌తో తన కెరీర్‌కు అదిరిపోయే పునాది వేసుకుంది.
అందాల విందు.. ట్రెడిషనల్ ట్రీట్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ క్రమంలో.. రితిక తన గ్లామర్ డోస్‌ను కూడా పెంచుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు అభిమానుల మతులు పోగొడుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా, సంప్రదాయబద్ధమైన లంగా ఓణీలో రితిక మెరిసిపోయింది.
చూడచక్కని పద్ధతిలో కనిపిస్తూనే, ఆ లంగా ఓణీలో తన నడుము వంపులు, అందాలను ఏమాత్రం దాచుకోకుండా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ “ఎంత చూడముచ్చటగా, లవ్లీగా ఉందేంట్రా బాబు!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మిరాయ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రితిక… ఇకపై సినిమాలతో పాటు ఇలాంటి స్టన్నింగ్ ఫొటోషూట్‌లతో కూడా బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్