స్మృతి మంధాన వరల్డ్ రికార్డు

స్మృతి మంధాన సంచలన ప్రపంచ రికార్డు: ఒకే ఏడాదిలో 1000 వన్డే పరుగులు!

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం (Visakhapatnam)లో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకుంది. గతంలో 1997లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ (Belinda Clark) చేసిన 970 పరుగుల రికార్డును స్మృతి బద్దలు కొట్టింది.

ఈ మ్యాచ్‌లోనే స్మృతి మంధాన మరో కీలక మైలురాయిని కూడా చేరుకుంది. వన్డేల్లో 5 వేల పరుగుల ఘనత సాధించిన ఐదో మహిళా బ్యాటర్‌గా నిలిచింది. అంతేకాకుండా, మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా (112 ఇన్నింగ్స్‌ల్లో) 5 వేల పరుగులు సాధించిన పిన్న వయస్కురాలు కూడా స్మృతినే. ఆస్ట్రేలియాపై 66 బంతుల్లో 80 పరుగులు చేసినప్పటికీ, స్మృతి మంధాన పోరాటం వృథా అయింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 330 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ (142) అద్భుత సెంచరీతో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది వరుసగా రెండో ఓటమిగా నమోదైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment