ఉచిత బ‌స్సుతో ప్ర‌యోజ‌నం ఏంటీ..? ప్ర‌భుత్వానికి మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌శ్న‌

ఉచిత బ‌స్సుతో ప్ర‌యోజ‌నం ఏంటీ..? ప్ర‌భుత్వానికి మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌శ్న‌

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  ప్రభుత్వం (Government)పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు (Women) ఉచిత బస్(Free Bus) ప్రయాణం ఇవ్వడం వల్ల అసలు ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. నెల్లూరులో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి (Chandrababu Government) ప‌లు సూచ‌న‌లు చేశారు. “ప్రజల భవిష్యత్తు విద్య, వైద్య రంగాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. విద్య పేదవాడిని సంపన్నుడిని చేస్తుంది, వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. ఉచితాలు అలవాటు చేయడం కన్నా ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి” అని ఆయన అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పారదర్శకత అవసరమని వెంకయ్య సూచించారు. “ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి, ఐదేళ్లలో ఎంత అప్పు చేశారు, ఎంత తిరిగి చెల్లించారు అన్న వివరాలను ప్రజలకు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పాలనకు ఇది అత్యంత కీలకం అని ఆయ‌న అన్నారు.

స‌భ‌లో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై..
అసెంబ్లీ ప్రవర్తనపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “సభలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. లేని వారిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సభలో ఎలా ప్రవర్తించాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి” అని అన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపు రాజకీయాలను అరికట్టాలని, ప్రజా ప్రతినిధులపై కేసులు రెండేళ్లలోపు తీర్చేయాలని, అవసరమైతే జడ్జిల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment