ఆర్టీసీతో నాలుగేళ్ల ప్రయాణం.. సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

ఆర్టీసీతో నాలుగేళ్ల ప్రయాణం.. సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

తాజాగా హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్, ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లుగా చేసిన తన సేవలపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇవాళ ఉద‌యం సీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న‌.. నిన్న ఆర్టీసీ ఎండీగా ఆఖ‌రి రోజు బ‌సులో ప్ర‌యాణించారు. అనంత‌రం ట్విట్ట‌ర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా ఉండేందుకు, ఉద్యోగులతో కలిసి వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించి, సంస్థను కష్టకాలం నుంచి బయటకు తేవడంలో తన పాత్రను వివరిస్తూ, ప్రతి ఉద్యోగిని అభివృద్ధిలో భాగస్వామిగా చేసుకున్నారు.

పాత బస్సులను కొత్త బస్సులతో రీప్లేస్ చేయడం, ఏడాదికి రూ.9000 కోట్లకు పైగా ఆదాయం సాధించడం, కార్పొరేట్ హాస్పిటల్‌ను తీర్చిదిద్దడం వంటి అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేశామ‌ని చెప్పారు. అలాగే, ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల ద్వారా 44,000 ఉద్యోగుల వైద్య పరీక్షలు నిర్వహించి, సుమారు 1,000 మంది జీవితం కాపాడామ‌న్నారు.

అత్యంత గౌరవంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సేవలను పునరావిష్కరించి, ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ సేవలను పొందుతున్నారని స‌జ్జ‌నార్ చెప్పారు. ఈ సందర్భంగా సజ్జనార్, ప్రతి ఉద్యోగి “ఈ సంస్థ నాది” అనే భావనతో అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ విధంగా రవాణా సేవలు మెరుగ్గా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.

తాజా ఎమోషనల్ పోస్ట్‌లో సజ్జనార్, ఆర్టీసీతో నాలుగేళ్ల ప్రయాణం అతనికి సంతృప్తి ఇచ్చిందని, భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా ఈ గొప్ప రవాణా సంస్థకు మద్దతు అందిస్తానని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించడం, సంస్థను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళడం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని సజ్జనార్ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment