ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్

ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్

హైదరాబాద్‌ (Hyderabad)లోని మల్లెపల్లి (Mallepalli) ఐటీఐ (ITI)లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను సీఎం(CM)రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఐటీఐలను ఏటీసీలుగా మార్పు
రాష్ట్రంలోని ఐటీఐలను ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATCs) మార్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. “యువతలో నైపుణ్యాలు పెంపొందించడం కోసం టాటాతో కలిసి పనిచేస్తున్నాం. త్వరలో మరో 53 ఏటీసీలను ఏర్పాటు చేస్తాం, భవిష్యత్తులో మొత్తం 116 ఏటీసీలను నెలకొల్పాలనేది మా సంకల్పం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 2,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.

గత ప్రభుత్వాలపై విమర్శలు
గత పదేళ్లలో రాష్ట్రంలో యువత ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. “నైపుణ్యాలు లేకపోతే ఇంజినీరింగ్ పట్టా కూడా పనికిరాదు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుందని అనుకోవద్దు. చైనా, జపాన్ లాంటి దేశాలు మన ముందు మోకరిల్లే పరిస్థితులు వస్తాయి” అని ఆయన అన్నారు. కేవలం సాఫ్ట్‌వేర్ కోర్సుల మీదనే ఆధారపడకూడదని యువతకు సూచించారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ఏటీసీలలో చేరే ప్రతి విద్యార్థికి (Student)రూ. 2 వేల స్టైఫండ్ (Stipend) ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, విద్యార్థులు గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, లేకపోతే తల్లిదండ్రుల బాధను అంచనా వేయలేరని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment