విశాఖ (Visakha)లోని ఆంధ్ర యూనివర్సిటీ (AU)లో విద్యార్థి (Student) మృతిచెందిన ఘటనపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీ వేదికగా స్పందించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై ఏయూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “నిన్న వైజాగ్ ఏయూలో ఫిట్స్ వచ్చిన కారణంగా ఒక విద్యార్థి మృతి చెందారు. మనం కాపాడలేకపోయాం. అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ రక్షించలేకపోయాం. అయితే, ఈ ఘటన వెనుక ఏదో ఉందని భావిస్తూ కొన్ని స్టూడెంట్ యూనియన్స్ పాఠాలు నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు.”
“తప్పు జరిగితే ప్రభుత్వం దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఎక్కడా తప్పు జరగలేదు, అటువంటి చోట రాజకీయాలు చేయడం సరైనది కాదు. కొంత మంది స్వార్థం కోసం యూనివర్సిటీల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అది బాధాకరమే. మన సమస్యలు మనమే చర్చించి పరిష్కరించుకుందాం. పెద్దఎత్తున పోరాటాలు అవసరం లేదు. కానీ, ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. కొంత మంది వాళ్ల స్వార్ధం కోసం యూనివర్సిటీల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం” అంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
మంత్రి లోకేష్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని, తమకు ఎలాంటి రాజకీయపరమైన అజెండా లేదని స్పష్టం చేశారు. ఏయూ వీసీ గీతం యూనివర్సిటీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. వీసీకి మద్దతు ఇచేలా లోకేష్ మాటలు ఉన్నాయని, ఇలాగే మాట్లాడితే మంత్రి నారా లోకేష్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.







