దేశంలోని ఎన్నికల విధానం లోపభూయిష్టమైందని, 60 లక్షల దొంగ ఓట్లు బయటపడ్డాయి అని మాజీ ఎంపీ చింతా మోహన్ (Chinta Mohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని ఎన్నికల విధానం (Elections System)పై, అలాగే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలన (Governance)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ (Election Commission) మోడీ(Modi)తో మిలాఖత్ (Meeting) అయిందని ఆరోపిస్తూ, ఎన్నికల విధానంలో మార్పులు అవసరమని అన్నారు. ప్రస్తుతమున్నది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుస్తున్న దొంగ విధానమని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. “15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన రాష్ట్రానికి చేసినది ఏమీలేదు. ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తానంటూ చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని అన్నారు. వాట్సాప్ పరిపాలన అంటూ చంద్రబాబు నిజానికి వాటాల పరిపాలన చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను (Medical Colleges) ప్రైవేటీకరించాలనే (Privatize) చంద్రబాబు ప్రయత్నం దుర్మార్గమని, కమిషన్ల కోసం కక్కుర్తిపడుతూ ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష గొంతు నొక్కి, కూనీ చేసి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన, రైతులపై జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రస్తావించారు. “యూరియా (Urea), ఎరువులు (Fertilizers) కృత్రిమ కొరత (Shortage) సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇది రైతులపై తీవ్రమైన ద్రోహం” అని అన్నారు.
అలాగే, దళితుల (Dalits) సమస్యలపై చంద్రబాబు దృష్టి సారించకపోవడాన్ని తప్పుపట్టిన ఆయన, ఎస్సీ వర్గీకరణ (SC Categorization) నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.








