అల్లూరి సీతారామ రాజు జిల్లా అరుకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు పై గిరిజనుల ఆందోళన ఉధృతమైంది. ఈ ప్రాజెక్టుతో తమ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని, జీవో నెంబర్ 51ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ప్రజలు వారు డిమాండ్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతంలో అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని ఆరోపిస్తూ గిరిజనులు మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు పంచాయతీల్లో సుమారు 7 వేల ఎకరాలు నష్టపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంత భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పలు సార్లు పర్యటించినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని వారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఒప్పందం రద్దు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని గిరిజనులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్