ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఇడుపులపాయలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పించారు. తన తండ్రి సమాధిపై చెయ్యి ఉంచి వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ జగన్ తన తండ్రికి నివాళులర్పిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైఎస్ విజయమ్మ, భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.
అనంతరం తన తండ్రిని గుర్తుచేసుకుంటూ, వైఎస్సార్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ మిస్సింగ్ యూ సో మచ్ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Missing you much. pic.twitter.com/xoW8sMKdFr
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2025
వైఎస్సార్ ఘాట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. పూలమాలలు సమర్పించి అంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలను, ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలను ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు.








