‘నేనెప్పుడూ ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తా..’ – సీఎం చంద్ర‌బాబు

'నేనెప్పుడూ ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తా..' - సీఎం చంద్ర‌బాబు

Summarize with AI

నేనెప్పుడూ ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తుంటాను.. రాజకీయం అంటే సేవాభావం. ప్రజలకు జవాబుదారీ (Accountability) తనం. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పి.. సూపర్ సిక్స్(Super Six) ప‌థ‌కాల‌ను సూపర్ హిట్‌(Super Hit)గా అమ‌లు చేసేశామ‌ని ముఖ్య‌మంత్రి(CM) చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం(Kuppam)లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. పరమసముద్రం చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి హంద్రీనీవా సుజల స్రవంతి పైలాన్‌ను ఆవిష్కరించారు. హంద్రీనీవా (Handri-Neeva) ద్వారా 19 నియోజకవర్గాల్లో 10 రిజర్వాయర్లకు నీళ్లు చేరుతున్నాయని, కుప్పం నియోజకవర్గంలో 738 కి.మీ. ప్రయాణించి వచ్చిన కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేసినట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమను కరవు నుంచి బయటపడేసేందుకు ఎన్టీఆర్ చేసిన సంకల్పాన్ని తాను కొనసాగిస్తున్నానని చెప్పారు. హంద్రీనీవా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతున్నదని వివరించారు. “కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నీటితో నిండుతాయి. రాబోయే ఏడాదికి మొత్తం చిత్తూరుకి హంద్రీనీవా ద్వారా నీళ్లు చేరుస్తాం” అని హామీ ఇచ్చారు.

వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. తాను రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాన‌ని, గ‌త ప్ర‌భుత్వ‌ పాలనలో మాత్రం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. అభివృద్ధి అడ్డుకోవడమే వైసీపీ రాజకీయం అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని ప్రకటించారు. “రాజకీయం అంటే సేవ, రౌడీయిజం కాదు. ప్రజల కోసం అభివృద్ధి యజ్ఞం చేస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా నా సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరు” అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment