అమరావతి ప్రాంతంలో మున్సిపల్ మంత్రి నారాయణ అర్ధరాత్రి పర్యటించారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మంత్రి పర్యటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎగువ ప్రాంతాల్లో వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో అమరావతి నీరుకొండ సమీపంలోని వెస్ట్ బైపాస్ రోడ్ వద్ద ఆయన పరిశీలించారు.
అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతూ.. వరద నీటి తరలింపు గురించి వివరణ ఇచ్చే క్రమంలో అమరావతి ముంపునకు గురైందని మున్సిపల్ మంత్రి నారాయణ పరోక్షంగా ఒప్పేసుకున్నారు. ముంపునకు గురి కాలేదంటూనే వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నట్లు వెల్లడించారు. అక్కడి బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని మంత్రి తెలిపారు. వరదల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేసేవాళ్లు అమరావతి ప్రాంతానికి వచ్చి చూడాలని కోరిన మంత్రి నారాయణ.. ముంపునీరు బయటకు వెళ్లడానికి బైపాస్ రోడ్డుకు గండ్లు పెడుతున్నట్లు మంత్రి నారాయణ అంగీకరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) August 20, 2025
అమరావతి ముంపునకు గురైందని ఒప్పుకున్న మంత్రి నారాయణ
అర్ధరాత్రి అమరావతిలో పర్యటన.. వరద నీరు వెళ్లకుండా బ్రిడ్జీ కింద 24 అడుగులు మట్టి పేరుకుపోయిందని వివరణ
అమరావతి ముంపునకు గురి కాలేదంటూనే వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నట్లు ఒప్పుకున్న నారాయణ
వరద ముప్పు… pic.twitter.com/iC8SOz4dEW
వరద నీటిని తొలగించేందుకు బైపాస్ రోడ్డు 50 మీటర్ల వరకు కోయాలని సూచించామని, ఇప్పటికే దాదాపు 20 మీటర్ల వరకు కోసేశామని మంత్రి వివరించారు. అమరావతికి వరద ముప్పు ఉండకుండా నెదర్లాండ్స్ నిపుణుల సలహాలతో కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేశామంటూ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రజలు కళ్లెదుట ముంపు అనుభవిస్తున్నా కూటమి ప్రభుత్వం మభ్య పెడుతోందని వైసీపీ సెటైర్లు వేస్తోంది.








