ఒకేరోజు రెండు కీల‌క‌ మీటింగ్‌లు.. అయోమయంలో కేడర్‌

ఒకేరోజు రెండు కీల‌క‌ మీటింగ్‌లు.. అయోమయంలో కేడర్‌

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)(BRS) శ్రేణుల్లో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. పార్టీలోని కీలక నాయకులైన కవిత (Kavitha), కేటీఆర్‌ (KTR)ల ఆధ్వర్యంలో ఒకేరోజు రెండు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలోని బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ చర్చించుకుంటున్నారని సమాచారం. ఇవాళ, తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) (BRSV) ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు జరగనున్నాయి.

తెలంగాణ జాగృతి కార్యక్రమం
మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి (Malkajgiri) జిల్లాలోని కొంపల్లి (Kompally) శ్రీ కన్వెన్షన్ హాల్‌ (Sri Convention Hall)లో తెలంగాణ జాగృతి తరఫున కవిత లీడర్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా జాగృతిని బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని గత నెల 15వ తేదీనే కవిత ఖరారు చేశారు.

బీఆర్ఎస్వీ శిక్షణా తరగతులు
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన వెలువడింది. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)తో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది. ఈ శిక్షణా తరగతులలో ఉదయం సెషన్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (T. Harish Rao) నిర్వహించగా, సాయంత్రం కేటీఆర్(KTR) పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.

తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్‌కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ, ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. దీంతో కార్యకర్తలు ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment