మూడో టెస్టులో భారత్ ఓటమి

మూడో టెస్టు (Third Test)లో భారత్‌ (India)కు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌ (England)తో జరిగిన ఈ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగగా, చివరి దశలో భారత్ చేజేతులా విజయాన్ని (Victory) చేజార్చుకుంది(Lost).

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు కుదేలై 170 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కి దిగిన భారత్ ఇంగ్లండ్ బౌలర్ల బంతులకు చకచకా వికెట్లు సమర్పించింది. ఒకదశలో వంద పరుగులకే టీమిండియా కుప్పకూలుతుంది అందరూ నిరాశలో కోరుకుపోగా, జడేజా జట్టును ఆదుకున్నాడు. ఆఖరి వికెట్ వరకు పోరాడాడు.

అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా, భారత్ అదే స్కోర్‌తో సమాధానం ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్‌కు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు.

ఈ విజయం ద్వారా ఇంగ్లండ్ 5 టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించి దూసుకెళ్లింది. సిరీస్ గెలవాలంటే భారత్ మిగిలిన రెండు టెస్టుల్లో విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment